సివిల్స్-2017 నోటిఫికేషన్ విడుదల

Saturday, February 25th, 2017, 03:31:29 PM IST


సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-2017 నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి మార్చి 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అప్లై చేసిన అభ్యర్థులకు ఈ ఏడాది జూన్ 18న ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది.

కేంద్రప్రభుత్వ అత్యున్నత పదవులకోసం ప్రతియేడాది రెండు విభాగాలుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్స్ సర్విసెస్ అప్టిట్యూడ్ టెస్ట్ (CSAT)ను నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ (అబ్జెక్టివ్), మరొకటి మెయిన్స్ (డిస్క్రిప్టివ్) ఈ ఏడాది మొత్తం 980 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ లో ఉండవచ్చని అంచనా.

సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వివరాలు

*పోస్టులు: 980(IAS, IPS, IFS)*

*దరఖాస్తు మొదలు: 22-Feb, 2017*

*చివరి తేది: 17-March, 2017*

*రాత పరీక్ష: 18-June, 2017*

*విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత*

*వయసు: 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి*

*ఫీజు: రూ. 100*

*వివరాలకు: www.upsconline.nic.in*