భారత 48 వ ప్రధాన న్యాయమూర్తి గా తెలుగు వ్యక్తి

Tuesday, April 6th, 2021, 12:01:14 PM IST

భారత ప్రధాన న్యాయమూర్తి గా తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ నూతల పాటి వెంకట రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన 48 వ ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే సుప్రీం కోర్టు సిజే గా జస్టిస్ రమణ పేరును ప్రతిపాదించారు ప్రస్తుత సిజే ఐ జస్టిస్ ఎస్ఏ బోబ్దే. కేంద్ర న్యాయశాఖ కి ఈయన సిఫారసు చేశారు. కాగా ఈ ప్రతిపాదనలను న్యాయశాఖ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ కి పంపగా ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ను ప్రధాన న్యాయమూర్తి గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఒక తెలుగు వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు స్వీకరించే అవకాశం రావడం ఇది రెండోసారి. మొదటగా 1966 జూన్ 30 వ తేదీ నుండి 1967 ఏప్రిల్ 11 వరకు తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ కోకా సుబ్బారావు సిజేగా బాధ్యతలు చేపట్టారు. వెంకట రమణ రెండోవ వ్యక్తి గా బాధ్యతలు చేపట్టనున్నారు. అతనికి ప్రముఖులు, ప్రజలు, సర్వత్రా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.