రాజ్ తరుణ్ తో వివాహం..లాస్య ఏమందో తెలుసా..?

Sunday, February 12th, 2017, 08:38:23 PM IST


యువహీరో రాజ్ తరుణ్, ప్రముఖ యాంకర్ లాస్య ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. వాటిపై తాజాగా లాస్య స్పందించింది.తాను సూసైడ్ చేసుకున్నారని రాసినా పరవాలేదు కానీ ఇలాంటి గాసిప్స్ ఎందుకు వస్తాయో అర్థం కావడంలేదని లాస్య అన్నారు. అసలు తనకు రాజ్ తరుణ్ తో పరిచయం లేదని ఆమె తెలిపింది.

ఓ ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో రాజ్ తరుణ్ తో దిగిన సెల్ఫీ వల్లనే ఈ చిక్కంతా వచ్చిందని ఆమె వాపోయింది.ఆ సెల్ఫీలో రాజ్ తరుణ్, నేను, సింగర్ నోయల్ ఉన్నాం. కానీ నోయల్ ని పక్కకు తప్పించి మాఇద్దరి మధ్యన గాసిప్స్ పుట్టిస్తున్నారని లాస్య తెలిపింది. నేను ఇంతరకు ఏహీరో ఆడియో ఫంక్షన్ లోను సెల్ఫీ దిగలేను. కానీ రాజ్ తరుణ్ తో సెల్ఫీ దిగడం తప్పయిందని లాస్య వాపోయింది. రవితో పాటు తాను అనేక షో లకు యాంకరింగ్ చేశాను. మాఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కుదిరింది కాబట్టి గాసిప్స్ పుట్టినా అందులో ఓ అర్థం ఉంది. కానీ రాజ్ తరుణ్ తో తనకు పరిచయం లేదని లాస్య తెలిపింది.