కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చండి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్..!

Friday, April 30th, 2021, 11:00:34 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో టెస్టుల కోసం ప్రజలు ఎదురు చూడాల్సి వస్తుందని, వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదని భట్టి అన్నారు. జనం సచ్చినా పరవాలేదు, అధాయమే ముఖ్యం అనే రీతిలో ప్రభుత్వం తీరు ఉందని అన్నారు. ఏడాది నుంచి ఆస్పత్రుల్లో సౌకర్యాలను ప్రభుత్వం పెంచలేక పోయిందని తప్పుబట్టారు.

అయితే సీఎం కేసీఆర్‌కు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నారని కానీ పేద ప్రజలు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళలేనంత దోపిడీ జరుగుతుందని అన్నారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లను ప్రభుత్వం అధీనంలో ఉంచుకోవాలని భట్టి డిమాండ్ చేశారు. ఆక్సిజన్ లేదంటూ కేంద్రం మీద నిందలు వేస్తున్నారు తప్పా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను బయటపెట్టడం లేదని అన్నారు.