కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.25కే లీటర్ పెట్రోల్ ఇచ్చేటోళ్లం – భట్టి విక్రమార్క

Sunday, March 7th, 2021, 03:00:41 AM IST

తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వరుసగా పెరుగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడిన ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.25కే లీటర్ పెట్రోల్ ఇచ్చేటోళ్లం అని చెప్పుకొచ్చారు. ఆనాడు అంతర్జాతీయ మార్కెట్‌లో 120 డాలర్లకు పైగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.75 లోపే లీటర్ పెట్రోల్ అందించిందని, ఇప్పుడు క్రూడ్ అయిల్ ధర 70 డాలర్ల లోపు ఉన్నా బీజేపీ ప్రభుత్వ, పెట్రోల్ ధరలు భారీగా పెంచుతుందని ఆరోపించారు.

అయితే పెట్రోల్, డీజిల్ పెరుగుదలతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అందుకే రేపటి నుంచి సైకిల్‌పైనే తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక ఐటీఐఆర్‌ ప్రాజెక్టును బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు గాలికొదిలేశాయని అందుకే ఈ రెండు పార్టీలకు పట్టభద్రులు సరైన బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క కోరారు.