అంబేద్క‌ర్‌ని గౌర‌వించిన ఒకే ఒక్క‌డు?

Saturday, April 14th, 2018, 10:42:32 PM IST

భార‌త రాజ్యాంగం రాసింది ఎవ‌రు? స‌్వ‌తంత్ర భార‌తావ‌ని తొలి సామాజిక‌, న్యాయ‌శాఖ మంత్రి ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఏకైక స‌మాధానం డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్‌. బాబా సాహెబ్‌గా సుప‌రిచితం. అలాంటి మ‌హ‌నీయుడిని నేడు సామాన్య జ‌నం మ‌ర్చిపోవ‌డం హాట్ టాపిక్‌. ఒక‌ప్పుడు అంబేద్క‌ర్ జ‌యంతి, వ‌ర్థంతి అంటే పూల‌మాల‌లు వేసి స‌త్క‌రించి, స్వీట్లు పంచుకునేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే ద‌ళిత‌వాడ‌ల్లోనే ఇది అతంత మాత్రంగానే క‌నిపిస్తోంది. ఇక ద‌ళిత‌నాయ‌కులు అయితే ఆయ‌న‌ను కేవ‌లం రాజ‌కీయాల కోసం మాత్ర‌మే వాడుకుని వ‌దిలేయ‌డం సిగ్గు చేటుగా మారింది. ఇక అగ్ర కులాల్లో అయితే రిజ‌ర్వేష‌న్ల కంపు ర‌గిలించిన ద‌ళితుడు అని వెలేశారు కూడా. ప్ర‌స్తుతం రాజ్యాధికారంలో ఉన్న ఓ అగ్ర కులం అయితే అంబేద్క‌ర్‌ని స‌త్క‌రించేది కేవ‌లం ద‌ళిత ఓట్ల కోసం మాత్ర‌మే అంటే అతిశ‌యోక్తి కాదు. ఇక‌పోతే దళితులు, బ‌డుగు -బ‌ల‌హీన వ‌ర్గాలు, నిమ్న‌కులాల ఓట్ల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు నేత‌లు ఊళ్ల‌ను సంద‌ర్శించ‌డం అక్క‌డ అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసే తంతు అంతా సినిమాటిగ్గా ఉంటుంది.

అదంతా స‌రే.. అస‌లు ఈరోజు అంబేద్క‌ర్ జ‌యంతి అన్న సంగ‌తి ఎంద‌రికి తెలుసు? క‌నీసం స్కూళ్ల‌కు వెళుతున్న పిల్ల‌ల‌కు అయినా తెలుసా? అంటే చాలా క‌ష్టం. భార‌త‌రాజ్యాంగం రాసింది ఎవ‌రు? అంటేనే చెప్ప‌లేని సన్నివేశం ఉంది. అయితే ఎవ‌రు గుర్తుంచుకున్నా, గుర్తుంచుకోక‌పోయినా సీఎం భ‌ర‌త్ మాత్రం ప‌క్కాగా గుర్తు పెట్టుకున్నాడు. నేడు అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా `భ‌ర‌త్ అనే నేను` టీమ్ ప్ర‌త్యేకించి శుభాకాంక్ష‌లు తెలిపింది. అంతేకాదు.. సీఎం గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌హేష్ ఆద‌ర్శ‌వంత‌మైన అంబేద్క‌ర్ పోటోని ఆఫీస్‌లో పెట్టుకున్నార‌ని తెలియ‌జెబుతూ ఓ పోస్ట‌ర్‌ని పీఆర్‌వో బి.ఎ.రాజు ట్వీట్‌ చేశారు. గొప్ప‌ గొప్ప వ్య‌క్తులు ఎప్పుడూ ఇత‌రుల కంటే డిఫరెంట్. వాళ్లు ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ సేవ‌కులేన‌న్న ట్యాగ్‌లైన్ ఇన్‌స్ప‌యిర్ చేస్తూ, ఈ ఫోటోపై క‌నిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments