ఆ విధంగా ముందుకు పోతాను అంటున్న చంద్రబాబు

Friday, December 30th, 2016, 04:39:09 PM IST

chandrababu
పోలవరం ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏపీ బహుళార్ధసాధక ప్రాజెక్ట్ పోలవరం స్పిల్ వే కాంక్రీట్ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. నవ్యంద్ర రాజధాని అమరావతికి వచ్చిన తరువాత మన దశ మారిందన్నారు. ఇక్కడకి వచ్చిన తరువాత ఏ పనులు చేపట్టిన నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని తన ఆనందం వెలిబుచ్చారు.

భారత ప్రధాని మోడీ మనకు అన్నివిధాలా సహకరిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇంతవరకు వచ్చాయని తెలిపారు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసే ఉద్దేశం లేదని చంద్రబాబు విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ వాళ్ళ దాదాపు 262 గ్రామాలూ ముంపుకు గురి అవుతాయని, కొత్త చట్టం ద్వారా నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే పోలవరం జల విద్యుత్ కేంద్రం ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ పోలవరం ప్రాజెక్ట్ ను 2019 లోపు పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments