సమాజంలో రెండే కులాలు ఉన్నాయంటున్న చంద్రబాబు నాయుడు

Thursday, December 29th, 2016, 04:37:17 PM IST

babu
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 332 కోట్లతో తొమ్మిది నెలల్లో విద్యుత్ స్తంభాల ద్వారా ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ రోజే గ్రామాన్ని ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటిస్తున్నామని అన్నారు. ప్రజలంతా కొత్తగా ఆలోచించాలని కోరారు.

పిల్లలకు ఎంత డబ్బు ఇచ్చామనేది ముఖ్యం కాదని, వాళ్ళను ఎంత చదివించాం , ఎంత గొప్పగా వాళ్ళను ప్రయోజకులను చేశామనేదే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. కులం, మతం, ప్రాంతం, వర్గాల పేరుతొ రెచ్చగొట్టేవారితో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమాజంలో రెండే కులాలు ఉన్నాయని అందులో ఒకటి డబ్బున్న వాళ్ళ కులం అని, మరొకటి డబ్బు లేని కులం అని అన్నారు. తనది కూడా పేదల కులమేనని, అందుకే నిత్యం పేదల గురించే ఆలోచిస్తూ ఉంటానని చంద్రబాబు చెప్పారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ను ఆయన కొనియాడారు. అందుకే పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది తన జీవితాశయం అని అన్నారు. తాను ఎప్పటికీ పేద ప్రజల కోసమే బ్రతుకుతాను అని స్పష్టం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments