చంద్రబాబుకు తప్పిన ముప్పు.. భారీ శబ్దంతో పేలిన సిలిండర్ !

Friday, September 30th, 2016, 10:56:33 PM IST

chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. శుక్రవారం ఢిల్లీలో చంద్రబాబు ఇండోసాన్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భం లో ఆయన మీడియాతో మాట్లాడుతుండంగా సెంట్రలైజడ్ ఏసీ సిలిండర్ పెద్ద పెద్ద శబ్దం తో పేలింది. దీనితో చంద్రబాబు సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వెంటనే కమాండోలు, అధికారులు ముఖ్యంన్తరిని బయటకు తీసుకుని వచ్చారు. గ్యాస్ లీకై సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది.దీనికి సంబందించిన మరిన్ని కారణాలు తెలియాల్సిఉంది. గతం లో కూడా చంద్రబాబు అలిపిరి లో జరిగిన పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడిన విషయం తెలిసిందే.