సీఎం జగన్ కల నెరవేరేనా?

Sunday, August 18th, 2019, 12:54:45 PM IST

అమెరికా పర్యటనలో భాగంగా జగన్ యూఎస్ లోని ప్రవాసాంధ్రులతో డల్లాస్ లోని హచిన్సన్ కన్వెన్షన్ లో సమావేశమయ్యారు. ప్రవాసాంద్రులకు స్వాగత వందనం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ , తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గడిచిన ఎన్నికలలో ప్రవాసాంధ్రుల పాత్ర చాల ముఖ్యమైనదని, వారి ప్రేమ అభిమానులే నన్ను ఇక్కడి వరకు వచ్చేలా చేసాయి అన్నారు. ఏ సీఎం కి రాని మెజారిటీ ని నాకు వచ్చేలా చేసినందుకు ప్రతీ ఒక్కరికి సెల్యూట్ చేసారు. సీఎం జగన్ తనకు ఒక కల ఉందని తెలియ చేసారు. అదేమిటంటే అవినీతి, లంచగొండి తనం లేని రాష్ట్రాన్ని చూడాలని అదే నా కల అని తెలియ చేసారు. సభ ప్రాంగణం అంతా హర్షధ్వనులతో, చప్పట్లతో, సీఎం సీఎం అంటూ నినాదాలు చేసారు.

అన్నం పెట్టె రైతు ఆకలి బాధతో మరణించకూడదు, ఏ ప్రభుత్వ పథకమైన లంచం, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి అందుబాటులో రావాలి, ప్రతి పొలానికి, ఎకరానికి కాల్వల అద్వారా నీరు రావాలి. ఇవన్నీ అందించడమే నా కల. గడిచిన రెండున్నర నెలల నుండి చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టె ప్రయత్నంలో వున్నా అని తెలియ చేసారు. ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి, రైతు భరోసా, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి కార్యక్రమాల గురించి చెప్తూ, గ్రామా సచివాలయాల్ని ఈ అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికీ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. మహిళలకు, స్థానికుల ఉద్యోగావకాశాల విషయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేపట్టాం అని తెలియచేసారు.

అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అంటూ, మరిన్ని విప్లవాత్మక మార్పులను వివరించారు.గ్రామా హాస్పిటల్స్, స్కూల్స్, అన్ని మరమ్మతులు చేస్తున్నాం. ముందు, ఆ తర్వాత ఫొటోలతో మార్పును మీరే గమనించవచ్చు అని తెలియ చేసారు. టెండరింగ్ లో రివర్స్ టెండరింగ్ పక్రియను అమలు చేయనున్నట్లు తెలిపారు. కర్రెంట్ బిల్ తక్కువ వచ్చే అవకాశాలు వున్న గత ప్రభుత్వం ఆలా చేయలేదని, 20 వేల కోట్ల డిస్కం బకాయిలు పడిందని తెలియ చేసారు.

ప్రవాసాంధ్రులు ప్రతి ఒకటి లేదా రెండు సంవత్సరాలకు ఒక సరి మన రాష్ట్రానికి రావాలని, పల్లె, పట్టణాల అంతర్యాలని చెరిపేలా రాష్ట్ర అభివృద్ధికి అందరు సహకరించాలని తెలియ చేసారు. త్వరలోనే ప్రభుత్వం వెబ్సైటు లో ఒక పోర్టల్ ను పెట్టనున్నట్లు తెలియ చేసారు. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోనవచును అని చెప్పారు. ఇంతలా జనం కోసం శ్రమిస్తున్న సీఎం జగన్ గారికి తన కల తొందర్లోనే నెరవేరాలని ప్రతి ఒక్క తెలుగోడి కల.