జగన్ డిసీషన్: సాల్వెంట్ ఫ్యాక్టరీ మృతుడి కుటుంబానికి 50 లక్షలు..!

Wednesday, July 15th, 2020, 11:28:29 AM IST

విశాఖలోని పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్‌ ఫాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సీనియర్‌ కెమిస్ట్‌ శ్రీనివాసరావు మృతి చెందారు. అయితే మృతుడి కుటుంబానికి సీఎం జగన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కంపెనీ యజమాన్యం తరఫున 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 15 లక్షల పరిహారం కలిపి మొత్తం 50 లక్షలను శ్రీనివాస్‌రావు కుటుంబానికి అందచేయనున్నారు.

అంతేకాదు ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేష్‌కు కూడా 20 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రమాదంపై విచారణ కమిటీ నివేదిక ఓ నివేదికను తయ్యారు చేసింది. ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ ప్రమాదం జరిగిన తీరు, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలపై రెండు పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్దిచేసే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా వివరణ ఇచ్చింది.