జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం – ఇకనుండి ఈ రెండు ఫోటోలు మాత్రమే…

Tuesday, November 12th, 2019, 10:53:14 PM IST

రాష్ట్రంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా అధికారులందరికీ కూడా ఒక ముఖ్యమైన ఆదేశాన్ని జారీ చేశారు. అదేంటో తెలుసా… ప్రభుత్వ కార్యక్రమాల్లో తన ఫొటోలకు సంబంధించి అధికారులందరికీ ఓ క్లారిటీ ఇచ్చారు. ఇకనుండి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి కార్యక్రమం చేపట్టినప్పటికీ, ఎలాంటి ప్రకటనలు చేసినా, ఎలాంటి వార్త వచ్చిన కూడా అందులో తనకు సంబందించిన ఈ రెండు ఫోటోలను మాత్రమే వాడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు.

అయితే జగన్ సీఎం అయిన తరువాత ఏపీ ప్రభుత్వ అధికార మాసపత్రిక కవర్ పేజీ మీద జగన్ ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ప్రచురితమవగా, ఈ విషయంలో అప్పట్లో పెద్ద చర్చ జరిగిందని చెప్పాలి… కాగా ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు జరిగినప్పటికి కూడా తనకు సంబందించిన రెండు ఫోటోలను వాడాలని ఫోటోలు విడుదల చేశారు.