రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ మరొక కీలక నిర్ణయం…?

Saturday, January 25th, 2020, 12:40:52 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా రాష్ట్ర రాజధాని విషయమై తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి రాజధాని అమరావతిలోని రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని అమరావతి నుండి తరలించొద్దని, అనవసరంగా రైతుల జీవితాలను నాశనం చేయొద్దని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు అందరు కూడా ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సీఎం జగన్ స్పందించడం లేదని రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

కాగా రాజధాని పరిధిలోని గ్రామాలను, గ్రామ ప్రజలందరినీ కూడా శాంతపరచడానికి రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే రాజధాని అమరావతిలోని మూడు గ్రామాలు పెదపరిమి, వడ్డెమాను, హరిశ్చంద్రపురం కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు మొదలెట్టారని సమాచారం. కానీ సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి…