సీఎం జగన్ మరొక సంచలన నిర్ణయం – 2 లక్షల మందికి పండగ బహుమానం

Sunday, October 20th, 2019, 03:00:12 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సీఎం జగన్… తాజాగా మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలందరికీ అంటే అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. ఈమేరకు రాష్టవ్య్రాప్తంగా 20లక్షల మంది అర్హులను గుర్తించామని, అర్హులందరికీ కూడా త్వరలోనే ఇళ్ల స్థలాలను అందజేస్తామని వెల్లడించారు. కాగా ఈ విషయాన్నీ సీఎం జగన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.

ఈమేరకు ఎక్కడైనా ఖాళీగా స్థలం కనిపిస్తే ఆ ప్రదేశములో ఇళ్ల నిర్మాణం జరపనున్నామని చెప్పారు సీఎం జగన్. అంతేకాకుండా పట్టాన ప్రాంతాల్లో కూడా ఈ నిర్మాణాలను చేపట్టామని, అయితే పట్టాన ప్రాంతాల్లో ఇప్పటివరకు 8 లక్షల మందికి పైగా ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారని, కాగా ఆ సంఖ్యా ఇంకా పెరగనుందని వెల్లడించారు సదరు అధికారులు… అయితే ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని అనుసంధానం చేసి, పేదలకు ఈ ఇల్లు నిర్మించి, రానున్న ఉగాది పండగ వరకు పేదలకు అప్పగించేలా ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.