మరొక ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్ – వైఎస్సార్ కంటి వెలుగు పథకం

Thursday, October 10th, 2019, 12:14:26 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొక కీలక పాఠాన్ని శ్రీకారం చుట్టారు. గురువారం నాడు అనంతపురం జిల్లాలో వై.ఎస్.ఆర్ కంటి వెలుగు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కాగా ఈ కంటి వెలుగు పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల 40 లక్షల మందికి నేత్ర పరీక్షలు చేసి, అవసరమైతే శస్త్రచికిత్స చేయనున్నారు. కాగా ఈ పథకం ప్రకారం మొదటి విడతలో సుమారు 70 లక్షల బడిపిల్లలకి ప్రాథమిక కంటి పరీక్షలు జరపనున్నారు. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా ఈనెల 10 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు ఈ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ పథకం కింద ఎవరైతే కంటి పరీక్షలు ఎదుర్కుంటున్నారో, వారిని నవంబర్ నెలలో విజన్ సెంటర్లకు పంపించనున్నారు.

అయితే ఈ పథకానికి కావాల్సిన సిబ్బందిని ఇప్పటికే నియమించారని సమాచారం. ఇందులో భాగంగా 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 14 వందల15 మంది వైద్యాధికారులు పధకం అమలులో భాగస్వాములు అవుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రాంతాలకు కానీ పరీక్షలకు సంబందించిన కిట్లను ఇప్పటికే పంపించేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు, టీచర్లు, ఏఎన్‌ఎంలు అందరు పాల్గొననున్నారు. అయితే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తునందుకు అందరు కూడా సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.