సీఎం జగన్ మరొక సంచలన నిర్ణయం – ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్… ?

Wednesday, March 25th, 2020, 08:14:52 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో దారుణంగా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలన్నీ కూడా ఎన్నో కఠినమైన చర్యలను చేపడుతున్నాయి. దాదాపుగా 21 రోజులు అందరు కూడా తమ ఇళ్లల్లో నుండి బయటకు రాకూడదని కర్ఫ్యూ ని విధించారు కూడా… కాగా ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. కాగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకొచ్చే దిశగా చర్యలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎందుకంటే ఒకవైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నారని సమాచారం.

అయితే ఈ సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వారి సహాయకులు.. అధికారులు, వారి సహాయకులు, అసెంబ్లీ సిబ్బంది, భద్రతా సిబ్బంది చాలా వరకు కూడా గుమిగూడనున్నారని, ఇలా చేస్తే ప్రభుత్వ నిబంధనలను, ప్రభుత్వాధికారులే అతిక్రమించినట్లవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందుకనే రాష్ట్ర బడ్జెట్ ని ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టనున్నారని సమాచారం… ఇకపోతే ఎలాంటి బడ్జెట్ సమావేశాలు జరపకుండా, ఎలాంటి ఆర్డినెన్సు ప్రవేశపెట్టకుండా రాష్ట్ర ఖజానా నుండి నిధులు ఉపయోగించుకునే వీలు ఉండదు. అందుకనే ప్రభుత్వ నేతలు ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం. కానీ అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది…