జగన్ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం – తెలుగు సబ్జెక్టు ఉండాల్సిందే…

Saturday, December 14th, 2019, 01:34:19 AM IST

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకున్నటువంటి సంచలనమైన నిర్ణయాల్లో ఒకటైన ఇంగ్లీష్ మీడియం అనే అంశం రాష్ట్రంలో ఎంతటి దుమారాన్ని రేపాయో మనందరికీ తెలిసిందే. కాగా విషయంలో సీఎం జగన్ మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా మన మాతృ బాషా అయినటువంటి తెలుగు బాషా ను కాపాడుకుంటేనే విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు నేర్పిస్తామని, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కూడా తెలుగు సబ్జెక్టు తప్పకుండ ఉండాల్సిందే అని శుక్రవారం నాడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇకపోతే ఇంగ్లీష్ మీడియం అనే అంశం పై రాష్ట్రంలోని విపక్షాలు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా సీఎం జగన్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా తన పని తాను చేసుకుంటూపోతున్నాడు. ఇకపోతే పేద విద్యార్థులు కోసం ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెడుతున్నామని, ఎవరైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం జగన్ ఇప్పడికే కొన్ని హెచ్చరికలు చేశారు.