సుగాలి ప్రీతీ తల్లికి సీఎం జగన్ భరోసా – తప్పకుండా న్యాయం చేస్తానని హామీ…

Wednesday, February 19th, 2020, 01:09:30 AM IST

మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని సుగాలి ప్రీతీ కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఎలాగైనా సరే తమకు న్యాయం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసుకున్నారు. కాగా మంగళవారం నాడు కర్నూలు లో కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ తరువాత అక్కడికి చేరుకున్న సుగాలి ప్రీతీ తల్లి పార్వతి తో సహా ప్రీతి కుటుంబ సభ్యులందరినీ కూడా సీఎం జగన్ కలుసుకున్నారు. ఈ మేరకు వారితో మాట్లాడిన సీఎం జగన్ తప్పకుండ వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా ఈ కేసును సీబీఐ కి రిఫర్‌ చేస్తున్నామని, తప్పకుండ తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే ఈ కేసు విషయమై మరొకసారి సవివరంగా మాట్లాడటానికి తన కార్యాలయానికి రావాలని, అక్కడ ఈ విషయం కోసం కూలంకషంగా మాట్లాడుకుందాం అని చెప్పిన సీఎం జగన్, సుగాలి ప్రీతీ తల్లిదండ్రులను తన కార్యాలయానికి తీసుకరావాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.