జగన్ ఆ విషయంలో కాస్త తగ్గడం బెటర్.. కారణమేంటో తెలుసా..!

Monday, July 1st, 2019, 04:15:48 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికారంలోకి వచ్చినప్పటి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా కాలేదు అయినా రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటూ సీనియర్ రాజకీయనేతలతోనే శభాస్ సీఎం సార్ అనిపించుకుంటున్నాడు. అంతేకాదు గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు చెబుతూ, తన ప్రభుత్వంలో అవినీతికి తావు ఇవ్వబోనని మాట ఇచ్చాడు.

అయితే కొద్ది రోజుల నుంచి సీఎం జగన్ కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలంటూ నోటీసులు జారీ చేయించారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టించారు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల విషయంలో కేవలం లాయర్ల ఫీజుల కోసమే ఇప్పటివరకూ ఓ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం దాదాపు 240 కోట్ల రూపాయలు ఉంటుందని ఓ అంచనా. అయితే ఇప్పుడు జగన్ ప్రభుతవం కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని పట్టుదలతో ఉన్నారు. అయితే ఆ భవంతులను నిర్మించింది డబ్బున బడానేతలే కావడం వారు ఒకవేళ కోర్ట్‌కు వెళితే ఆ సమస్యల్య్ ఇప్పుడిప్పుడే పూర్తికావు. పైగా ప్రభుత్వం తరుపున కోర్ట్‌లో వాదించడానికి లాయర్ల ఫీజు అంతా ఇంతా కాదు. అయితే రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో జగన్ వాటి జోలికి వెళ్ళకుండా కాస్త తగ్గితే బెటర్ అని అంటున్నారు కొందరు నిపుణులు. అంతేకాదు అక్రమంగా ఉన్న భవనాలను కూలగొట్టకుండా ప్రజావసరాల కోసం ఉపయోగిస్తే బెటర్ అనే సలహాలు కూడా ఇస్తున్నారు. అయితే జగన్ మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.