ఆ విషయంలో జగన్ ఎవరి మాట వినడంలేదట..!

Monday, July 22nd, 2019, 12:00:08 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకుండానే జగన్ కాస్త అధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నాడట.

అయితే ఒక ముఖ్యమంత్రిగా జగన్‌కి అన్ని అధికారాలు ఉన్నా ప్రభుత్వ పాలన విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే గతంలో జగన్ తండ్రి వైఎస్ఆర్ అంత పేరు సంపాదించుకోవడానికి కార్ణం తాను చెప్పబోయే హామీల దగ్గర నుంచి ప్రజల ముందు మాట్లాడే మాట దాకా అన్నిటిలోనూ ఎన్నో జగ్రత్తలు తీసుకునేవాడు. ఏదైనా చేయదలుచుకుంటే ఒకటికి పది సార్లు ఆ కోవలో అనుభవం ఉన్న అధికార్లను సంప్రదించి అడుగులు వేసేవాడు. అయితే ప్రస్తుతం జగన్ మాత్రం అధికారులతో కాస్త భిన్నంగా ఉన్నాడట. సొంత నిర్ణయాలు తీసుకుంటూ తాను చెప్పింది జరిగిపోవాలంటూ ఒక ముఖ్యమంత్రిగా చెబుతున్నాను అని అంటున్నాడట. అయితే అధికారులు మాత్రం జగన్‌కు అడ్డు చెప్పలేక కొన్ని కొన్ని విషయాలలో కాస్త అసంతృప్తితో ఉన్నారట.