బిగ్ బ్రేకింగ్: జగన్ కేబినెట్‌లో ఎవరెవరికి ఏఏ శాఖలు వరించాయో తెలుసా..!

Saturday, June 8th, 2019, 04:40:07 PM IST

ఏపీ మంత్రులుగా జగన్ కేబినెట్‌లో 25 మంది మంత్రులు కొద్ది సేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సచివాలయ ప్రాంగణంలో వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మరియు మరికొంత మంది ప్రజాప్రతినిధుల, ఉన్నతాధికారుల మధ్య ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అయితే మంత్రులుగా ముందు ధర్మాన కృష్ణదాస్‌ ప్రమాన స్వీకారం చేయగా ఆ తరువాత మిగతా వారు చేశారు. అయితే తమకు మంత్రివర్గంలో అవకాశం కలిపించిన వైసీపీ అధినేత జగన్‌కు వారందరూ ధన్యవాదాలు తెలుపుకున్నారు. అయితే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఎవరెవరికి ఏఏ శాఖలు అప్పగించారు అనేది మాత్రం ఈ క్రింద తెలపడం జరిగింది.

జగన్ కేబినెట్‌లో మంత్రులు మరియు వారికి సంబంధించిన శాఖల వివరాలు:

1) ధర్మాన కృష్ణదాస్‌ – రోడ్లు, భవనాల శాఖ
2) బొత్స సత్యనారాయణ – మున్సిపల్ శాఖ
3) పాముల శ్రీపుష్పవాణి – డిప్యూటీ సీఎం మరియు గిరిజన సంక్షేమ శాఖ
4) అవంతి శ్రీనివాస్ – పర్యాటకశాఖ
5) పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ – రెవెన్యూ శాఖ
6) పినిపె విశ్వరూప్‌ – సాంఘీక సంక్షేమ శాఖ
7) కురసాల కన్నబాబు – వ్యవసాయ శాఖ
8) తానేటి వనిత – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
9) చెరుకువాడ శ్రీరంగనాథరాజు – గృహ నిర్మాణ శాఖ
10) ఆళ్ల నాని – వైద్య శాఖ
11) కొడాలి నాని – పౌరసరఫరాల శాఖ
12) వెల్లంపల్లి శ్రీనివాస్‌ – దేవాదాయ శాఖ
13) పేర్ని నాని – రవాణా మరియు సమాచార శాఖ
14) మేకతోటి సుచరిత – డిప్యూటీ సీఎం మరియు హోం శాఖ
15) మోపిదేవి వెంకట రమణ – పశు సంవర్ధక మరియు మత్స్య శాఖ
16) బాలినేని శ్రీనివాస్‌రెడ్డి – అటవీ, పర్యావరణ శాఖ
17) ఆదిమూలపు సురేశ్ – విద్యా శాఖ
18) అనిల్‌కుమార్‌ యాదవ్‌ – ఇరిగేషన్ శాఖ
19) మేకపాటి గౌతంరెడ్డి – పరిశ్రమల శాఖ
20)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పంచాయితీరాజ్ శాఖ
21) నారాయణ స్వామి – ఎక్సైజ్ శాఖ
22) బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి – ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ
23) గుమ్మన జయరామ్‌ – కార్మిక, ఉపాధి శాఖ
24) అంజాద్‌ బాషా – మైనారిటీ శాఖ
25) మాలగుండ్ల శంకర్‌ నారాయణ – బీసీ సంక్షేమం