ప్లాష్ ప్లాష్: జిల్లాల వారిగా జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది వీరే..!

Saturday, June 8th, 2019, 11:39:52 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే నేడు తన మంత్రివర్గాన్ని సీఎం జగన్ ప్రకటించబోతున్నారు. అయితే ఇదే రోజే వారితో ప్రమాణ స్వీకారం కూడా చేయించబోతున్నారు. అయితే నిన్న సీఎం జగన్ సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించి మొత్తం తన కేబినెట్‌లో 25మంది మంత్రులు ఉండబోతున్నారని, ఐదుగురు డిప్యూటీ సీఎంలు కూడా ఉంటారని చెప్పారు. అంతేకాదు ఇప్పుడు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవిలో కొనసాగుతున్నారని, ఆ తరువాత మిగతా వారికి అవకాశం కల్పిస్తామని తన నిర్ణయాన్ని కూడా ప్రకటించారు.

అయితే నిన్న సీఎల్పీ సమావేశం నిర్వహించిన సీఎం జగన్ మంత్రివర్గ జాబితాను మాత్రం ఇంకా భయటపెట్టలేదు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం సీఎం జగన్ అన్ని వర్గాల వారికి న్యాయం చేశారని, సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా మంత్రివర్గాన్ని రూపొందించారని, అయితే ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కని వారికి తిరిగి రెండున్నర సంవత్సరాలలో చోటు లభిస్తుందని సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి మా పార్టీ ఎమ్మెల్యేలమంతా అంగీకారం తెలిపామని చెబుతున్నారు. అయితే జిల్లాల వారిగా సీం జగన్ ఎవరెవరికి స్థానం కల్పించారు, మరి కొద్ది సేపటిలో ఎవరెవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారో తేలిపోయింది.

జిల్లాల వారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేది వీరే:

1) కృష్ణా: పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌
2) గుంటూరు: మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి
3) శ్రీకాకుళం: ధర్మాన కృష్ణదాస్‌
4) విజయనగరం: బొత్స సత్యనారాయణ, పాముల శ్రీపుష్పవాణి
5) విశాఖపట్నం: అవంతి శ్రీనివాస్‌
6) తూర్పు గోదావరి: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్‌
7) పశ్చిమ గోదావరి: తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజు, ఆళ్లనాని
8) చిత్తూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి
9) ప్ర‌కాశం: బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
10) నెల్లూరు: మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌
11) కర్నూలు: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మన జయరామ్‌
12) అనంతపురం: శంకర్‌ నారాయణ
13) కడప: అంజాద్‌ బాషా