బిగ్ బ్రేకింగ్: కడప జిల్లా నుంచి కాబోయే మంత్రికి జగన్ ఫోన్..!

Friday, June 7th, 2019, 09:28:27 AM IST

ఈ ద‌ఫా జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక మెజార్టీ ఎమ్మెల్యే స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు సీఎం జగన్. అంతేకాదు ఈ నెల 8వ తేదిన తన కేబినెట్ ఉండే పేర్లను ప్రకటించి వారితో కూడా ప్రమాణస్వీకారం చేయిస్తానని ఇదివరకే ప్రకటించారు. అయితే అసలు జగన్ కేబినెట్‌లో ప్రస్తుతం ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయనేదే ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.

అయితే రేపే మంత్రివర్గ కేబినెట్‌ను సీఎం జగన్ ప్రకటించనుండడంతో కడప జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేను కేబినెట్‌లోకి తీసుకుంటున్నామని నిన్న ఆ ఎమ్మెల్యేకు సీఎం జగన్ నుంచే ఫోన్ కాల్ వచ్చిందంట. గత పది సంవత్సరాలుగా పార్టీనీ నమ్ముకుని, జగన్ వెంటే ఉంటూ, ఎన్ని ప్రలోభాలు వచ్చినా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కడప జిల్లా రైల్వే కోడూరు ఎంఎల్ఏ కోరుముట్ల శ్రీనివాసులుకు మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో జగన్ ఉన్నారట. నిన్న స్వయంగా జగన్ నుంచే ఫోన్ వచ్చి క్యాబినెట్లోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు అందుకోసం వెంటనే విజయవాడకు బయలుదేరి రావాలంటూ ఆదేశించారట. దీనితో కోరుముట్ల ఆనందానికి అవధులు లేకుండా పోయిందట. పార్టీ ఆదేశం మేరకు కోరుముట్ల తన అనుచర వర్గంతో వెంటనే విజయవాడకు బయలుదేరి వెళ్ళారు. అయితే తమ నాయకుడికి సీం జగన్ దగ్గర నుండి ఫోన్ వచ్చి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని తెలియగానే కోరుముట్ల అనుచరులు నియోజకవర్గంలో సంబరాలలో మునిగితేలారు. బాణసంచా పేల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రంలోపు మంత్రివర్గంలో స్థానం లభించే వారందరికి ఫోన్‌లు వెళ్ళే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.