అంతా బాగానే ఉన్నా జగన్ కాస్త జాగ్రత్తగా ఉండటం బెటర్..!

Saturday, June 8th, 2019, 03:57:26 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఏపీ మంత్రులుగా జగన్ కేబినెట్‌లో 25 మంది మంత్రులు కొద్ది సేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ జాబితాను చూస్తుంటే సీఎం జగన్ అన్ని వర్గాల వారికి న్యాయం చేశారని, సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా మంత్రివర్గాన్ని రూపొందించారని అర్ధమవుతుంది.

అయితే సీఎం జగన్ తన మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి 6, బీసీలకు 7, కాపులకు 4, కమ్మ సామాజిక వర్గానికి 1, క్షత్రియ సామాజిక వర్గానికి 1, ఎస్సీలకు 4, ఎస్టీ లకు 1, ఆర్య వైశ్య 1, మైనారిటీ సామాజిక వర్గానికి 1 చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం కు స్పీకర్ పదవిని, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. అయితే నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు రెండున్నర సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటారని, ఆ తరువాత కొత్తవారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.

అయితే అంతా భాగానే ఉన్న సీఎం జగన్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో కూడా అందరూ ప్రశంసిస్తునా, కొంత మంది మాత్రం జగన్‌ను హెచ్చరిస్తున్నారు. సీఎం జగన్ ప్రయత్నాలు బాగానే చేశారు కానీ కాస్త వెనుకా ముందు కూడా చూసుకుని ఉంటే బాగుండేది అని అంటున్నారు. అయితే తక్కువ స్థానాలు గెలుపొందిన విశాఖ సిటీకీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారే తప్పా, ఎక్కువ స్థానాలు గెలుచుకున్న విశాఖ జిల్లాకు స్థానం కల్పించలేదని అంటున్నారు. అయితే చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్ర వెలమలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు జగన్ కేబినెట్‌లో కనిపించలేదని అన్నారు. అయితే సీఎం జగన్ మళ్ళీ గెలవాలంటే సామాజిక న్యాయం ఒకటే కాకుండా, పార్టీ జనాల సమతూకం కూడా చూసుకోవాలని అంటున్నారు. ఇదంతా ఇప్పుడు బాగానే ఉన్నా అసంతృప్తి అనేది ఇప్పుడే కనిపించదు అని మెల్ల మెల్లగా బయటకు వస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే అప్పట్లో ఎన్‌టీఆర్ గెలిచినప్పుడు కూడా ఇలానే ఉందని ఆ తరువాత మెల్లగా అందరూ జారుకున్నారని ఏది ఏమైనా ఇలాంటి సమయంలో జగన్ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారట.