కేబినెట్ ప్రమాణస్వీకారంపై సీఎం జగన్ షరతులు.. ఏంటో తెలిస్తే షాక్..!

Friday, June 7th, 2019, 11:37:46 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ నెల 8వ తేదిన తన మంత్రివర్గ జాబితాను ప్రకటిస్తానని, మరుసటి రోజే వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తానని ఇదివరకే ప్రకటించారు. అందులోనే భాగంగా మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి, ఎలాంటి ప్రాతిపదికన తీసుకోవాలి అనే దానిపై మొన్నటి వరకు కసరత్తులు చేపట్టారు. అయితే ఇప్పుడు ఆ అంశం తుదిదశకు చేరుకుంది.

అయితే నేడు సీఎం జగన్ మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకున్నారనే అంశానికి తెరపడనుంది. అయితే ఇప్పటికే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఏపీ సీఎం జగన్ ఈ ఏర్పాట్ల పూర్తి బాధ్యతలను ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంకు అప్పచెప్పారు. ఏపీ సెక్రటరియేట్ పరిధిలో జరిగే ఈ కార్యక్రమానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు వారి కుటుంబ సభ్యులు కూర్చోవడానికి ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని దగ్గరి నుంచి చూసేలా అన్ని వైపులా ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆహ్వానానికి సంబంధించిన ఇన్విటేషన్‌లో కార్యక్రమానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా ఉంచారు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం తన ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగినట్టే ఈ కార్యక్రమం కూడా సాదాసీదాగా జరగాలని హంగులు ఆర్భాటాలకు వెళ్ళి ఖర్చు చేయకూడదని, కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలు, అభిమానుల నుంచి సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు, ఆటంకాలు కలగకూడదని సీఎస్‌కు షరతులతో కూడిన ఆదేశాలను జారీ చేశారట. ఏది ఏమైనా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రేపటి ఏపీ భవిష్యత్తు పైనే ఉండడంతో పార్టీ శ్రేణులలోనే కాదు సామాన్య ప్రజానీకం కూడా తన నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారట.