ఆ నేతకు జగన్ కేబినెట్‌లో బెర్తు ఫిక్స్.. సంబరాల్లో అభిమానులు..!

Sunday, June 2nd, 2019, 02:08:55 AM IST

ఏపీలో ఈ దఫా జరిగిన ఎన్నికలకు సంబంధించి గత నెలలో ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలలో వైసీపీ భారీ విజయనని సొంతం చేసుకుంది. అంతేకాదు రెండు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ విజయవాడలో ప్రమాణస్వీకారం కూడా చేసారు. అయితే మొన్న జగన్ ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసాడు. అయితే తన మంత్రి వర్గాన్ని మరో వారం రోజులలో ప్రకటిస్తానని చెప్పాడు జగన్. అయితే జగన్ కేబినెట్‌లో అసలు ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అనే దానిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి.

అయితే ఎన్నికల ప్రచారం సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులను ఇస్తానని ప్రజల ముందే వాగ్దానం చేశారు. అయితే జగన్ హామీ ఇచ్చిన జాబితాలో గుంటూర్ జిల్లాకు చెందిన మర్రి రాజశేకర్ ఒకరు. చిలకలూరిపేట అభ్యర్థిగా తన సీటును వదులుకుని టీడీపీ మంత్రి పత్తిపాటి పుల్లారావ్‌ను ఓడించి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విడదల రజనీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే తాను ఎన్నికలలో విడదల రజినీ గెలుపు కోసం పనిచేశారు. అయితే మంత్రి పత్తిపాటి పుల్లారావ్‌పై వైసీపీ అభ్యర్థి రజనీ గెలవడంతో పాటు, వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఖాయమైనట్టు కనిపిస్తుంది. అయితే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా జగన్ కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈయన ఇంటి దగ్గర పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఈయనను కలిసి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారట. అయితే ఈయనకు కేటాయించిన శాఖ కానీ, మంత్రిగా బెర్త్ ఖరారైన సమాచారం కానీ పార్టీ నుంచి మాత్రం ఇంకా వెలువడలేదు.