ఆ ఇద్దరిని అడిగే సీఎం జగన్ ఏ పనైనా చేస్తాడట..!

Wednesday, August 21st, 2019, 11:19:22 PM IST

ఏపీలో ఈ ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు బీజేపీతో వైసీపీ కాస్త సన్నిహిత్యంగా ఉన్న అధికారంలొకి వచ్చాక మాత్రం వైసీపీ, బీజేపీల మధ్య సరైన పొంతన లేదనే వాదనలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా పీపీఏల సమీక్ష, పోలవరం రివర్స్ టెండరింగ్ లపై జగన్ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం లేఖలు రాయడంతో పాటు, పోలవరంపై పోలవరం అథారిటీ చైర్మన్ ని నివేదికలు ఇవ్వమని కోరడంతో ఆ అనుమానాలు మరింత పెరిగాయి. పీపీఏల సమీక్ష, మరో పక్క పోలవరం రివర్స్ టెండరింగ్ లపై జగన్ తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం సీరియస్‌గా ఉందని అర్ధమయ్యింది. అయితే దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి మాత్రం కేంద్రంతో మాకు మంచి సంబంధాలే ఉన్నాయని జగన్ ఏ పని చేసిన దానికి కేంద్రం అనుమతులు తీసుకోనే చేస్తున్నారని, అవినీతిని అడ్డుకునే విషయంలో తమ ప్రభుత్వానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిందని తిన్నదంతా త్వరలోనే కక్కిస్తామని అన్నారు.