జగన్ డిసీషన్: ఏపీ జిల్లాలకు కొత్త ఇంఛార్జ్ మంత్రులు వీరే..!

Sunday, October 20th, 2019, 09:47:09 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే తన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలని తన కేబినెట్‌లో కూడా అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాడు. అంతేకాదు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు తమ తమ శాఖలలో త్వరలోనే మంచి పట్టు సాధించాలని, మీ శాఖలలో ఎక్కడ అవినీతి జరిగినా దానికి మీరే బాధ్యులు అని ముందుగానే తేల్చి చెప్పారు.

అయితే ఇప్పుడు తాజాగా జగన్ తన కేబినెట్‌లోని మంత్రులను ఏపీలోని 13 జిల్లాలకు ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ జిల్లాల అభివృద్ధి బాధ్యతలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే బాధ్యతలను కూడా మంత్రులకు అప్పగించాడు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

జిల్లాల వారిగా ఇంఛార్జ్ మంత్రుల వివరాలు:

1) కడప జిల్లా – ఆదిమూలపు సురేశ్
2) కర్నూలు జిల్లా – అనిల్ కుమార్ యాదవ్
3) అనంతపురం జిల్లా – బొత్స సత్యనారాయణ
4) చిత్తూరు జిల్లా – మేకపాటి గౌతమ్ రెడ్డి
5) కృష్ణా జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
6) శ్రీకాకుళం జిల్లా – కొడాలి నాని
7) విశాఖపట్నం – కురసాల కన్నబాబు
8) విజయనగరం – వెల్లంపల్లి శ్రీనివాస్
9) గుంటూరు జిల్లా – చెరుకువాడ రంగనాథరాజు
10) ప్రకాశం జిల్లా – బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
11) నెల్లూరు జిల్లా – బాలినేని శ్రీనివాస్ రెడ్డి
12) తూర్పు గోదావరి జిల్లా – మోపిదేవి వెంకటరమణ
13) పశ్చిమగోదావరి జిల్లా – పేర్ని నాని