సీఎం జగన్ డిసీషన్.. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరో కీలక బాధ్యత..!

Wednesday, June 3rd, 2020, 12:32:30 AM IST


వైసీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు సీఎం జగన్ మరో కీలక బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు అన్ని ఆగిపోయాయి. అయితే రాష్ట్రంలో త్వరలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది.

అందుకే దీనిపై ఓ కమిటీనీ వేయాలని భావించిన సీఎం జగన్ ఆ కమిటీ చీఫ్‌గా రోజాను నియమించబోతున్నట్టు సమాచారం. ఆమె కింద ఐఏఎస్ అధికారిని కూడా నియమించనున్నారు. ఇకపై ఎవరైనా టాలీవుడ్ దర్శక, నిర్మాతలు, హీరోలు ఏపీలో ఏదైనా షూటింగ్స్ నిమిత్తం పర్మిషన్ కావాలంటే ప్రభుత్వం తరుపున రోజా అనుమతి తీసుకోవాలని, అప్పుడు ఆమె ఐఏఎస్ అధికారి ద్వారా షూటింగ్స్‌కు అనుమతులు ఇస్తుంది అని అన్నారు. సినిమా షూటింగ్స్ విషయమై రోజాకు మంచి అవగాహన ఉన్న నేపధ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.