జగన్ డిసీషన్: విజయసాయి రెడ్డి ప్లేస్‌లో మరో కీలక నేతకు ఛాన్స్..!

Friday, July 5th, 2019, 03:25:30 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే తమ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో అదే ప్రభుత్వం నుంచి ఒకరిని ఢిల్లీలో తమ ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్నుకోవడం ఆనవాయితీ.

అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ గత నెల 22న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా జారీ చేసిన జీవో 68ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎంపీ పదవిలో ఉన్నందున విజయసాయి నియామకాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే విజయసాయి రెడ్డి స్థానంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల‌రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని జగన్ భావిస్తున్నారట. అయితే ఈ సారి ఎన్నికలలో మోదుగుల గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్ది గ‌ల్లా జ‌య‌దేవ్ పై 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే 9 వేల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగలేదని అది జరిగి ఉంటే నేనే గెలిచి ఉండేవాడినని ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఆ వివాదం కూడా కోర్ట్‌లో ఉండడంతో మోదుగులను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించాలని జగన్ ఎక్కువ మక్కువ చూపుతున్నారట.