బ్రేకింగ్: ఆ నిజాయితీ గల ఆఫీసర్‌ను జగన్ ఏరీకోరీ నియమించుకున్నాడుగా..!

Thursday, June 6th, 2019, 11:01:51 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక దాని తరువాత ఒకటి నెరవేరుస్తూనే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.

అయితే గత ప్రభుత్వ హయాంలో అమరావతితో పాటు దాని పరిసర గ్రామాల్లో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవడమే కాకుండా, రాజధాని నిర్మాణ పనుల కోసం సిఆర్‌డిఎ ను ఏర్పాటు చేసింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 3,821 ఎకరాలను భూసేకరణ చట్టం ద్వారా సేకరించారు. ఆ తరువాత కొంత మంది రైతులు తమ భూములను ఇవ్వమని తేల్చి చెప్పారు. ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. అయితే రాజధాని నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో గట్టిగా వార్తలు వినిపించాయి. అయితే ఆ అవినీతిని కూకటివేళ్ళతో సహా పెకిలించడానికి ఒక నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిని నియమించారు సీఎం జగన్. గతంలో ఈయన సాధారణ పరిపాలన కార్యదర్శిగా, కర్నూల్‌ జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశాడు. 2003 బ్యాచ్‌ కి చెందిన ఐఏఎస్‌ అధికారి పి. లక్ష్మీనరసింహం ఇప్పుడు సిఆర్‌డిఏ కమిషనర్‌గా సీఎం జగన్ ఆయనను నియమించారు. ఈయన నిజాయితీ, నిబద్ధతకు ఎంతలా కట్టుబడి ఉన్నారంటే తనకు ప్రభుత్వం నుంచి వేలలో జీతం వస్తున్నా కానీ ఇప్పటికి తన కూతురుని మునిసిపల్‌ స్కూల్లో చదివిస్తున్నాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం పెట్టిన పాఠశాలపై మనకే నమ్మకం లేకపోతే ఇక సామాన్య జనానికి ఎలా నమ్మకం కుందురుతుందని చెప్పే ఈ అధికారి ఎక్కడ అవినీతి జరిగినా సహించడు. అందుకే ఈయనను సీఎం జగన్ ఏరికోరి మరి సిఆర్‌డిఎ కమీషనర్‌గా పదవి బాధ్యతలు అప్పచెప్పారు.