బ్రేకింగ్: జగన్ చేసిన పనికి మంత్రులు ఓ రేంజ్‌లో పనిచేస్తున్నారుగా..!

Wednesday, June 19th, 2019, 02:20:06 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు తన ప్రభుత్వంలో అవినీతి రహిత పాలనను అందిస్తానని ఇప్పటికే మాట కూడా ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే తన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకుని వారిని కూడా ఆ అంశంపై దృష్టి సారించేలా సూచనలు ఇస్తున్నారు.

అయితే అందులోనే భాగంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో లేకపోయినా, మంత్రులు అందుబాటులో ఉండాలని ఇంతవరకు ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. మంత్రులుగా, ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారి ఫోన్ నంబర్లను భయటపెట్టమని జగన్ ఆదేశాలు ఇచ్చారు. అందుకే అధికారులు, పార్టీ నేతలు మంత్రుల నంబర్లను బహిర్గతం చేసారు. దీంతో మంత్రులకు ప్రజల నుంచి సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. అయితే తాజాగా రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నానికి వచ్చిన ఓ ఫోన్ కాల్ వ్యవహారం ప్రస్తుతం సంచలనం రేపుతుంది. కృష్ణాజిల్లా ముసునూరు గ్రామం పరిధిలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోందని సమాచారం అందింది. దీంతో అ సమస్యను పరిష్కరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే బస్సును సీజ్ చేయాలని నాని అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు.

అయితే మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఆ బస్సును తనికీ చేయడం కోసం ఆ పాఠశాల భయట నిలబడి బస్సు బయటకు వస్తే తనికీ చేయాలని అనుకున్నారు. అయితే దీనిని గమనించిన ఆ బస్సు డ్రైవర్ సాయంత్రం వరకు కూడా బస్సు భయటకు తీయలేదు. పిల్లలు ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు రాగా పైసల కోసం రవాణా వారు బెదిరిస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే బస్సును తిరగనివ్వమని అంటున్నారని స్కూల్ యాజమాన్యం చెప్పగా, పిల్లల తల్లితండ్రులు ఆ ఇన్ స్పెక్టర్ ను నిలదీశారు. దీంతో అంతమందికి సమాధానం చెప్పలేక ఆ ఇన్ స్పెక్టర్ మంత్రి ఆదేశాల మేరకు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అయితే ప్రజల కోసం కష్టపడడానికి రెడీగా ఉన్న మంత్రులకు ప్రజలు కూడా కాస్త చైతన్యవంతులై సహకరిస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని అవినీతిపరుల మాటలు విని మోసపోవద్దు అంటూ అధికార పార్టీ ప్రతినిధులు, అధికారులు ప్రజలను కోరుతున్నారు.