సీఎం జగన్ నిర్ణయం చంద్రబాబు, కేసీఆర్‌లకు చెంపపెట్టు..!

Friday, June 14th, 2019, 11:35:57 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అంతేకాదు తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో తనదైన శైలిలో మాట్లాడుతూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే ఈ సారి ఎన్నికలలో అందరి అంచనాలను అధిగమించి 175 అసెంబ్లీ స్థానాలలో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టారు వైసీపీ అధినేత జగన్. అయితే టీడీపీ మాత్రం కేవలం 23 స్థానాలనే గెలుచుకుని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైపోయింది. అయితే ఇక టీడీపీ పరిస్థితిని గమనించిన గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీకీ గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరాలని నిశ్చయించుకున్నారు. అయితే జగన్ మాత్రం దీనిపై ముందు నుంచే ఒక స్పష్టతతో ఉన్నారు. పార్టీ మారే యొచనలో ఉన్న వారు ఎవరైనా తమ పదవికి, పార్టీకి రాజీనామా చేసి వస్తే తప్పా పార్టీలో చేర్చుకోమని ఖరాఖండిగా చెప్పేశారు.

అయితే పక్క రాష్ట్రం తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి భారీ విజయాన్ని నమొదు చేసుకుని అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 12 మందిని చేర్చుకుని ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకుంది. అయితే 2014 ఎన్నికలలో వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకున్న చంద్రబాబు వారిలో కొంత మందికి మంత్రి పదవులను కూడా కట్టబెట్టాడు. అయితే ప్రతిపక్షాలను లేకుండా చేసుకుని పాలనను కొనసాగించాలని అనుకున్న చంద్రబాబుకు, కేసీఆర్‌కు విలువలను కాపాడుతూ, చట్ట సభలను గౌరవిస్తూ పార్టీలోకి చేరే వారికి ఆంక్షలను పెట్టి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయాలలో సీనియర్ నాయకులైనటువంటి చంద్రబాబుకు, కేసీఆర్‌కు ఇదో చక్కటి చెంపపెట్టు విధానమని ప్రజలందరూ భావిస్తున్నారట. ఏది ఏమైనా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరికి బుద్ధి చెప్పేలా ఉన్నాయంటూ పార్టీ శ్రేణులు చర్చోప చర్చలుగా చెప్పుకుంటున్నారట.