బిగ్ బ్రేకింగ్: ఏపీలో స్పీకర్ ఎవరో తేల్చేసిన సీఎం జగన్

Thursday, June 6th, 2019, 06:09:59 PM IST

ఈ ద‌ఫా జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక మెజార్టీ ఎమ్మెల్యే స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు సీఎం జగన్. అంతేకాదు ఈ నెల 8వ తేదిన తన కేబినెట్ ఉండే పేర్లను ప్రకటించి వారితో కూడా ప్రమాణస్వీకారం చేయిస్తానని ఇదివరకే ప్రకటించారు.

ఇదిలా ఉండ‌గా అసెంబ్లీ స్పీక‌ర్‌గా సీఎం జ‌గ‌న్ ఎవ‌రిని ఎంపిక చేయ‌నున్నారు అన్న అంశంపైనే ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ స్పీక‌ర్ రేసులో న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, బాప‌ట్ల ఎమ్మెల్యే కోనా ర‌ఘుప‌తి, ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వారితోపాటు తాజాగా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు పేరు సైతం తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌త్య‌ర్ధుల‌పై ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రించాలో అంబ‌టి రాంబాబుకు వెన్న‌తోపెట్టిన విద్య అని, ఆ క్ర‌మంలో స్పీక‌ర్ ప‌ద‌విలో ఆయనైతేనే కరెక్ట్ అని పార్టీ శ్రేణులు కూడా స్పీకర్‌గా ఆయననే ఎన్నుకోవాలని ఒత్తిడి తెస్తున్నారట. అయితే సీఎం జగన్ కూడా అంబటి రాంబాబుకే స్పీకర్ పదవి ఇవ్వాలని నిశ్చయించుకున్నారట.