వీలైతే ప్రేమిద్దాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. జగన్ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడుగా..!

Thursday, July 4th, 2019, 04:21:22 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

అయితే జగన్ ముందు నుంచే రాజకీయాలలో ఎలాంటి విద్వేషాలు లేకుండా కలుపుగొలు తనంగానే ముందుకు వెళ్తున్నాడు. తన ప్రమాణ స్వీకారానికి కూడా రాజకీయ శత్రువులైన చంద్రబాబుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు ఫోన్ చేసి మరీ రావాలని కోరాడు. అయితే వారు వెళ్ళారా లేదా అనేది పక్కన పెడితే పిలిచే ధర్మం జగన్‌కి ఉంది కాబట్టే పిలిచాడని వైసీపీ నాయకులు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మరోసారి వీలైతే ప్రేమిద్దాం.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనే సినిమా డైలాగ్‌ను నిజం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు జగన్. ఈ ఎన్నికలలో వైసీపీ భారీ విజయంతో గెలిచినా పెద్దగా అభినందించకపోగా మీరు ఎందుకు ఓడిపోయారు అని అడిగితే గాంధీ మహాత్ముడు కూడా ఓడిపోయాడు, ఎన్నికల్లో గెలుపు ఓటములు నిజం కాదు, డబ్బు ఖర్చు చేయకుండా ఎవరైనా గెలిచారా? అని పరోక్షంగా వైసీపీకి కౌంటర్ ఇచ్చేలా మాట్లాడాడు. అంతేకాదు కరకట్టపై అక్రమ కట్టడాలను తొలగిస్తే కనీసం మంచి చేసాడని జగన్‌ని మెచ్చుకోకుండా కూల్చివేత తప్పు అన్నట్టుగానే మాట్లాడాడు.

ఇంతకి ఎవరు ఆయన అనుకుంటున్నారా జయప్రకాశ్ నారాయణ. అయితే ముందు నుంచే ఈయన కాస్త టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం చేస్తూ వచ్చినా టీడీపీ మాత్రం ఈయనను కనీసం ఒక లీడర్‌గా కాదు కదా, కనీసం ఏదైన ఒక కార్యక్రమానికి గెస్ట్‌గా కూడా పిలవలేదు. కానీ జగన్ మాత్రం ఈయనకు నిజంగా షాక్ ఇచ్చే పనే చేసాడు. ఈ రోజు జరిగిన ఎమ్మెల్యేల అవగాహనా కార్యక్రమానికి జేపీని ఆహ్వానించాడు జగన్. జేపీ తమ పార్టీపై ఎన్ని విమర్శలు చేసినా జగన్‌ చూపిన మర్యాద, పెద్దరికాన్ని రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు. పగోడిని కూడా మనోడు అనుకునే జగన్‌ వ్యక్తిత్వానికి తెలుగు ప్రజానీకమంతా సలాం కొడుతున్నారు.