పరువు తీసుకుంటున్న జగన్..! తొందరపాటు కొంప ముంచుతుంది

Sunday, August 25th, 2019, 09:37:33 AM IST

నిన్న అమెరికా నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చిన జగన్ మోహన్ రెడ్డి హడావిడిగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మూడు కీలకమైన శాఖలకు చెందిన అధికారులను, లాయర్లను పక్కన పెట్టుకొని సుదీర్ఘమైన సమావేశం నిర్వహించాడు. కానీ అందులో ఎలాంటి ఫలితం తేలలేదు, సమస్య ఒక కొలిక్కి రాలేదు. జగన్ ని ఇంత గాబరా పెట్టె సమస్య ఏమిటని అనుకుంటున్నారా..? పోలవరం,జలవిద్యుత్ కేంద్రం విషయంలో హైకోర్టు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీనిపై తదుపరి ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనే దాని గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాళ్లు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళితే అక్కడ అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో చెప్పలేము. దాదాపుగా హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం కూడా చెప్పవచ్చు, అదే కనుక జరిగితే జగన్ పరువు ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని వర్గాల్లో జగన్ ఇమేజి తగ్గిపోతుంది. దానికి తోడు హైకోర్టు తీర్పుని లెక్కచేయకుండా సుప్రీంకి వెళ్ళాడు. అతను చేస్తుంది తప్పు అని చెప్పిన కానీ, లెక్కచేయకుండా సుప్రీం గడపతొక్కడంటూ ఎల్లో మీడియా ఎలాగూ ప్రచారం చేస్తుంది. అనుకూలంగా తీర్పు వచ్చిన దానికి చాలా సమయమే పడుతుంది. దానితో పోలవరం పనులు చాలా ఆలస్యం అవుతాయి. దాని వలన మరో సమస్య మొదలవుతుంది. వీటి నుండి ఎలా బయటపడాలి, ఏ విధంగా ముందుకి పోవాలి అనే దాని గురించే నిన్న ఆ సమావేశం జరిగింది. అయినా కానీ అందులో ఎలాంటి ఫలితం తేలలేదు .