మంత్రులకి చుక్కలు చూపిస్తున్న జగన్

Monday, August 19th, 2019, 07:54:16 AM IST

అవినీతి రహిత పాలన అందించటమే నా లక్ష్యం అంటూ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి చెపుతూనే వున్నాడు. అందులో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. అలాంటి నిర్ణయాలు పార్టీకి కొంచం ఇబ్బంది కలిగిస్తాయి, కొన్ని కొన్ని విషయాల్లో చూసి చూడనట్లు వదిలేయాలి అంటూ కొందరు చెప్పిన కానీ జగన్ వాళ్ళ మాట వినలేదు. ప్రజలకి ఇచ్చిన హామీ మేరకు అవినీతి లేకుండా చేయాలనీ కంకణం కట్టుకున్నట్లు మనకి అనిపిస్తుంది.

ముఖ్యంగా ప్రభుత్వంలో మంత్రులుగా చేస్తున్న వారి దగ్గర అవినీతి పెద్ద ఎత్తున జరిగే ఆస్కారం బాగా వుంది. వివిధ రకాలైన పనులకి మంత్రులకి పెద్ద స్థాయిలోనే ముడుపులు అందుతాయి. ప్రతి పనికి కూడా సిండికేట్లు పెద్ద ఎత్తున్న ఉంటారు. వాళ్ళకి నుండి డబ్బుల సంచులు అందుతాయి. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి సిండికేట్ల మీద దృష్టిపెట్టాడు. ముఖ్యంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగే, ఇసుక,మద్యం సిండికేట్ల మీద ఫోకస్ పెట్టాడు.

దీనితో అక్కడి నుండి ముడుపులు మంత్రులకి రావటం లేదు. వాటిలో ఎలాంటి లాబీలు చేయటానికి వీలులేకుండా జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రతి నియోజకవర్గంలో వీటి నుండి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు గతంలో బాగా సంపాదించే వాళ్ళు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా జగన్ చేశాడు. దీనితో ఆయా నేతలు ఈ విషయం మింగలేక,కక్కలేక చస్తున్నారు