ఏపీ మహిళా మంత్రులకు బిగ్ షాక్.. నో ఛాన్స్ చెప్పిన జగన్..!

Sunday, October 20th, 2019, 10:54:49 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే తన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలని తన కేబినెట్‌లో కూడా అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాడు. అంతేకాదు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు తమ తమ శాఖలలో త్వరలోనే మంచి పట్టు సాధించాలని, మీ శాఖలలో ఎక్కడ అవినీతి జరిగినా దానికి మీరే బాధ్యులు అని ముందుగానే తేల్చి చెప్పారు.

అయితే ఇప్పుడు తాజాగా జగన్ తన కేబినెట్‌లోని మంత్రులను ఏపీలోని 13 జిల్లాలకు ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ జిల్లాల అభివృద్ధి బాధ్యతలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే బాధ్యతలను కూడా మంత్రులకు అప్పగించాడు. అయితే 13 జిల్లాలకు సంబంధించి ఇంఛార్జ్ మంత్రులుగా అందరూ పురుషులకే అవకాశం కల్పించారు. ఇందులో ఏ ఒక్క మహిళా మంత్రికి అవకాశం కల్పించలేదు. అయితే జగన్ కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. హోంమంత్రిగా మేకతోటి సుచరిత, ఉప ముఖ్యమంత్రిగా పాముల పుష్పశ్రీవాణి, మహిళా శిశు సంక్షేమం మంత్రిగా తానేటి వనిత తమ శాఖలను నిర్వహిస్తున్నారు. అయితే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని అనుకున్న ప్రభుత్వం ఆ రోజు ఇన్‌చార్జి మంత్రులే ఆయా జిల్లాలలో జాతీయ జెండాలను ఎగరవేయనున్నారు.