బిగ్ బ్రేకింగ్: ఆ ఫ్యామీలికీ జగన్ మరో బంఫర్ ఆఫర్..!

Friday, October 18th, 2019, 09:30:01 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా రాజకీయపరమైన అంశాలలో కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాడు.

అయితే ఈ ఎన్నికలలో పరుచూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సీనియర్ రాజకీయ నేత, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై జగన్ ఒక కొత్త డిమాండ్ ఉంచారని పార్టీలో గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓటమిపాలైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాస్త పార్టీలో యాక్టివ్‌గా లేకపోవడంతో వైసీపీ మాజీ నేత రామనాథం బాబును తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు జగన్. అంతేకాదు త్వరలోనే ఆయనకు నియోజకవర్గ బాధ్యతలను అప్పచెప్పాలని కూడా అనుకుంటున్నారు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ జగన్‌పై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూ వస్తుంది. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక పార్టీలో కొనసాగాలంటే పురంధేశ్వరిని వైసీపీలోకి వచ్చేలా చేయాలని సీఎం జగన్ ఆయనకు ఒక కండిషన్ పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందనేది తెలియకపోయినా తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటుంటే అది నిజమేనని అనుమనాలు వస్తున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయంలో జగన్ నిర్ణయమే ఫైనల్ అని, పురంధేశ్వరి వైసీపీలోకి వస్తే రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ హామీ కూడా ఇచ్చారని పర్చూరు వైసీపీ నేతలతో మంత్రి అన్నట్టు పార్టీలో సమాచారం. అయితే రాజకీయంగా దగ్గుబాటి కుటుంబంపై వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే మాత్రం ఆ కుటుంబం ఖచ్చితంగా నోరు విప్పాల్సిందే.