జగన్ డిసీషన్: సీజ్ చేసిన వాహనాలు రూ.100 కట్టి తీసుకెళ్ళండి..!

Sunday, May 24th, 2020, 12:28:36 AM IST

ఏపీలో లాక్‌డౌన్ నియమ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజ్ అయిన వాహనాలపై నేడు సీఎం జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే సీజ్‌చేసిన వాహనాలను విడుదల చేయాలని, ఇకపై నియమాలను ఉల్లఘించబోమంటూ వాహనదారుల నుంచి హామీపత్రాన్ని తీసుకుని, కేవలం 100 రూపాయల జరిమానాతోనే వాహనాలను వాహనాదారులకు ఇచ్చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అంతేకాదు వాహనాలు తిరిగి అప్పగించేటప్పుడు కరోనా నివారణ కోవిడ్‌ జాగ్రత్తలపై కూడా వారికి అవగాహన కల్పించాలని పోలీసులు, అధికారులకు జగన్ ఆదేశాలిచ్చారు. అయితే కష్టకాలంలో ఎంత జరిమానా కట్టాల్సి వస్తుందో అని భయపడ్డ వాహనాదారులకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది.