బ్రేకింగ్: టీడీపీ నేత కొడుకుకి కీలక పదవి కట్టబెట్టిన జగన్..!

Tuesday, September 17th, 2019, 10:23:52 PM IST


ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు.

అయితే టీడీపీ దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చిన్న కుమారుడు సందీప్ కుమార్‌ కోసం సూపర్ న్యూమరీ పోస్టును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన జీతభత్యాలను కూడా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 మే 16న కిడారి సర్వేశ్వరరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక 2016 ఏప్రిల్ 28న టీడీపీ పార్టీలో చేరిపోయారు. అయితే గత ఏడాది సెప్టెంబరు 23న మావోయిస్టులు కిడారిని దారుణంగా కాల్చి చంపారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్ కుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టి, చిన్న కుమారుడు సందీప్ కుమార్‌కు గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్‌ను ఇచ్చింది. అయితే 2019 జనవరి 31న డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సందీప్ కుమార్ ఆ తర్వాత 72 వారాల ట్రైనింగ్ కోసం విజయనగరం జిల్లా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా వెళ్లారు. అయితే శిక్షణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కలెక్టర్ సాధారణ విధుల్లో సందీప్ కుమార్‌ చేరే వరకు సూపర్ న్యూమరీ పోస్టు కింద విధులు నిర్వర్తించనున్నారు.