బ్రేకింగ్: వైసీపీ యువనేతకు కీలక పదవి కట్టబెట్టిన జగన్..!

Wednesday, September 18th, 2019, 04:54:07 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం 28 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో ఏపీ నుంచి ఎనిమిది మందికి అవకాశం లభించగా, తెలంగాణ నుంచి ఏడుగురికి చోటు కల్పించారు. అయితే గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతకు కూడా ఈ మండలిలో చోటు కల్పించారు. ఈ సారి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపె నేత కె.శివకుమార్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. కేసీఆర్ గతంలో వైఎస్‌ను తిట్టారని, వైసీపీ అభిమానులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని బహిరంగంగానే చెప్పడంతో అప్పట్లో వైసీపీ పార్టీ ఆయనను పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 2019 లో శివకుమార్ మళ్ళీ జగన్‌ని కలవడంతో ఆయనను తిరిగి వైసీపీలోకి చేర్చుకున్నారు. అయితే అప్పట్లో తెలంగాణ జనరల్ సెక్రటరీగా నియమించారు. అయితే తాజాగా ఈ యువ నేతకు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కూడా జగన్ అవకాశం కల్పించారు .