బిగ్ బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళకు కీలక పదవి ఇవ్వబోతున్న సీఎం జగన్..!

Thursday, June 13th, 2019, 12:18:22 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే ముందు నుంచి సీఎం జగన్ మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం లభిస్తుందని అనుకున్న నేతలకు మాత్రం కాస్త చేదు అనుభవమే మిగిలింది. అయితే సామాజిక సమీకరణాల అంశాలను పరిగణలోకి తీసుకున్న కారణంగా మంత్రివర్గ స్థానంలో కొందరు నేతలకు సీం జగన్ చోటు కల్పించలేకపోయారు.

అయితే ప్రస్తుతం పార్టీలో పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారట. అయితే ఇప్పుడున్న మంత్రులు కేవలం రెండున్నర సంవత్సరాలే అధికారంలో ఉంటారని, ఆ తరువాత మిగతా వారికి అవకాశం కల్పిస్తానని జగన్ చెప్పినా కూడా వీరిలో ఆ నిరాశ మాత్రం తగ్గలేదు. అయితే మంత్రి పదవి ఆశించిన లిస్ట్‌లో చాలా మందే ఉన్నారు. అయితే వీరికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టి వీరిని బుజ్జగించే పనిలో ఉన్నరట సీఎం జగన్. అయితే ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతగా, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని అప్పగించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని అప్పచెప్పారు.

ఇక మంగళగిరి నుంచి నారా లోకేశ్‌పై విజయం సాధిస్తే ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ముందే హామీ ఇచ్చారు. అయితే వివిధ సమీకరణాల వలన ఆళ్ళకు మంత్రి పదవిని కేటాయించలేకపోయారు. అయితే మంత్రి పదవి పక్కా అని నమ్మిన ఆళ్ళ నిరాశ చెందడంతో ఆయనకు ప్రస్తుతానికి ఒక కీలక పదవిని అప్పగించే యోచనలో జగన్ ఉన్నారట. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించుకున్నారని మరో రెండు రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత రాబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.