బిగ్ బ్రేకింగ్: ఆ వైసీపీ నేతకు కీలక పదవి అప్పచెబుతున్న జగన్..!

Wednesday, July 17th, 2019, 05:00:46 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేకాదు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కూడా వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యాడు.

అయితే జగన్ పదవి బాధ్యతలు చేపట్టాక తన మంత్రివర్గంలో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించడం, కొన్ని సామాజిక సమీకరణ అంశాలను పరిగణలోకి తీసుకున్న కారణంతో కొంతమంది నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు. అయితే మంత్రివర్గంలో స్థానం లభించని నేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నాడు. అయితే ఇప్పటికే కొందరికి కొన్ని నామినేటెడ్ పదవులను అప్పచెప్పిన జగన్ తాజాగా మరో వైసీపీ నేతకు కీలక పదవి అప్పచెప్పాలని భావిస్తున్నాడట. అయితే అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలయ్యపై పోటీ చేసి ఓటమి పాలైన ఇక్బాల్‌కు ఇటీవల గుంటూర్‌లో జరిగిన ఇప్తార్ విందులో పాల్గొన్న జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చాడు.

అయితే ఈయన మాజీ ఐపీఎస్ అధికారి కావడం,, ఐజీగా పోలీస్ శాఖలో సేవలు అందించడంతో ఈయనను రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సలహాదారులుగా నియమించాలని జగన్ అనుకుంటున్నారట. అయితే ఈయన ఎన్నికలకు ముందు టీడీపీనీ వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే హిందూపురం నియోజకవర్గానికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పచెప్పి హిందూపురం టికెట్ కూడా ఇచ్చారు జగన్. అయితే టీడీపీకి మంచి పట్టు ఉన్న హిందూపురంలో చివరివరకు బాగానే పోటీ ఇచ్చి స్వల్ఫ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఇక్బాల్. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భధ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈయనను రాష్ట్ర హోంశాఖ సలహాదారునిగా నియమించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడట. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఈయనకు నియమక ఉత్తర్వులు అందుతున్నట్టు సమాచారం.