పింఛన్ దారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్… మళ్లీ పెంచేశారుగా!

Saturday, July 11th, 2020, 02:49:21 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కో క్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ కూడా పథకాల విషయం లో జగన్ ఎటువంటి వెనకడుగు వేయలేదు. అయితే ఈ నేపధ్యంలో జగన్ సర్కార్ పించన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం పింఛన్ దారులు పొందుతున్న 2,250 రూపాయలను 2,500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పింఛన్లను గ్రామ వాలంటీర్ ల ద్వారా అందించనున్నట్లు తెలిపింది.

అయితే గత ప్రభుత్వ హయం లో ఇచ్చిన వాటి కంటే ఎక్కువగా పింఛన్లను ఇస్తుంది ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక 250 రూపాయలు పెంచగా, మరొకసారి ఇపుడు 250 రూపాయలు పెంచడం జరిగింది. అయితే ఆగస్ట్ 1 నుండి ఈ విధానం అమలు కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ నెలలో జరిగే కేబినెట్ సమావేశం కీలకం కానుంది. రాష్ట్ర అభివృద్ది అంశాలకు, ప్రజల శ్రేయస్సు పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.అంతేకాక ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రెడీ చేయాలని అధికారులకు సైతం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.