నిజంగా జగన్ అంత పని చేశాడా.. హ్యాట్సాఫ్ సీఎం సార్..!

Wednesday, June 5th, 2019, 08:55:18 AM IST

వైసీపీ అధినేత జగన్ జననేతగా ఎంత పేరు సంపాదించుకున్నాడంటే అది మాటలలో చెప్పలేం. ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో ఓపికతో రాజకీయాలలో ఉంటూ తనను నమ్ముకున్న ప్రజల కోసం ఏదైనా చేయాలనే సంకల్పం ఆయనలో బలంగా కనిపించింది. గత ఎన్నికలలో ఓటమి పాలైనా తన ప్రజల కోసం వారి కష్టాల తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేపట్టి గడగడపకి తిరిగి నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ పేదవారి గుండెల్లో ధైర్యాన్ని నింపిన మహానేత వైఎస్ జగన్. రాజకీయాల కోసం కాకుండా తన తండ్రి ఆశయ సాధనకై తన ప్రజలకు తిరిగి రాజన్న రాజ్యం అందించాలని పరితపిస్తున్న యువనేత.

అయితే వీటన్నిటి ఫలితమే ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను గెలిపించి ప్రజలపై జగన్ పెట్టుకున్న విశ్వాసాన్ని పదింతలు చేసి చూపించారు ఏపీ ప్రజలు. అయితే ఏపీకీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ కొద్ది రోజుల క్రితమే ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. అంతేకాదు అవినీతిరహిత పాలనను ప్రజలకు అందించాలని భావిస్తున్నారు.

అయితే నిన్న విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తానెప్పుడు ప్రజల మనిషినే అని జగన్ మరోసారి నిరూపించాడు. విశాఖ పర్యటన ముగిసిన అనంతరం జగన్ తిరిగి తన కాన్వాయ్‌లో వెలుతుండగా బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అంటూ బ్యానర్‌ పట్టుకున్న కొంతమంది యువతీ యవకులు కనిపించారు. వీరిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ ఆపించి కిందికి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు. కేన్సర్‌తో బాధ పడుతున్న తమ స్నేహితుడు నీరజ్‌ కుమార్‌ ఆపరేషన్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుందని, 30 తేదీలోగా అతడికి ఆపరేషన్‌ చేయించాలని ముఖ్యమంత్రితో వారు చెప్పారు. వారి మాటలను విన్న సీఎం జగన్‌ ఆపరేషన్‌కు ఎంత ఖర్చయినా వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మీ స్నేహితుడికి ఏమి కాదు నేనున్నానంటూ ఆ స్నేహితులకు ఒక స్నేహితుడిగా జగన్ ధైర్యాన్ని అందించారు. అయితే ఇప్పటివరకు ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదని గతంలో ప్రజల సమస్యలు చెప్పటానికి సీఎం దగ్గరకు వెలితే గేట్ భయటే పంపించేసేవారని జగనన్న మాత్రం సీఎం హోదాలో ఉండి కూడా రోడ్దు మీద వాహనం ఆపి మరి ప్రజల సమస్యలను తీరుస్తున్నందుకు నిజంగా అలాంటి వ్యక్తికి రుణపడి ఉండాలని ఎన్ని సార్లైనా ఆయనే ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారట ఏపీ ప్రజలు.