లేటెస్ట్ అప్డేట్ : తన నిర్ణయం పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Thursday, November 14th, 2019, 10:25:23 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత మెజారిటీని సొంతం చేసుకొని, రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నటువంటి వైసీపీ పార్టీ రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలని తీసుకుంటూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాడనికి తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే సీఎం జగన్ ఇటీవల తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం వలన విపక్షాలు అన్నీకూడా ఒక్కటై ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా, సీఎం జగన్ ఎక్కడ తగ్గకుండా తన నిర్ణయాన్ని అమలు చేసే పనిలో ఉన్నారు సీఎం జగన్.

కాగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయడానికి సీఎం జగన్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మన పిల్లలందరూ కూడా ఇంగ్లిష్ మీడియం చదువుకోవాలని, ఆలా అయితేనే రాష్ట్రము అంత కూడా బాగుపడుతుందని సీఎం జగన్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో మనబడి నాడు-నేడు కార్యక్రమాన్నిలాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ ఆ తరువాత పైలాన్ ను ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

కాగా రాష్ట్రం అంత కూడా పేదరికం నుండి బాగుపడాలంటే… చదువు ఒక్కటే మార్గం అని సీఎం జగన్ అన్నారు. కాగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువులు తప్పని సరి అని, అంతేకాకుండా నన్ను విమర్శించే వారందరి కి సంబందించిన వారందరు వారి పిల్లలను ప్రభుత్వ తెలుగు మీడియం పాఠశాలల్లోనే చదివిపిస్తున్నారా అని సీఎం జగన్ ప్రశ్నించారు.