సీఎం జగన్ కీలక నిర్ణయం – షాక్ లో డాక్టర్లు

Wednesday, September 18th, 2019, 09:08:16 PM IST

ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ తన పాలన విషయంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు. కాగా అభివృద్ధి కోసం ఎక్కడ కూడా తగ్గకుండా ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్రంలోని పేద ప్రజలందరికోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తండ్రి ప్రారంభించినటువంటి ఆరోగ్య శ్రీ పథకంలో ఎన్నో కీలకమైన మార్పులు చేసి, వైద్యాన్ని రాష్ట్ర ప్రజలందరికి కూడా మరింత చేరువ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య రంగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి నిపుణుల కమిటీ కొన్ని కీలకమైన సూచనలను తెలిపింది.

కాగా నిపుణుల కమిటీ దాదాపుగా సూచించిన 100 సిఫారసులలో ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడంపై పూర్తిగా నిషేదించాలని తెలిపింది. అందుకుగాను వారందరికీ కూడా అధిక వేతనాలు ఇవ్వాలని తెలిపింది. కాగా వీటికి సీఎం జగన్ తక్షణమే ఆమోదం తెలిపారు. ఇకపోతే కేవలం ఇక్కడే కాకుండా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయనున్నారు. కాగా ఈ సేవలన్నీ కూడా నవంబర్ నెల నుండి ప్రారంభం కానున్నాయని సమాచారం. ఈసిఫారసుల్లో మరొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే, ఆరోగ్య శ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కమిటీ తెలిపింది. కాగా వీటన్నింటికి కూడా సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమోదం తెలిపారు.

నిపుణుల కమిటీ చేసిన సిఫారసులు…

1.మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి
2.ప్రతి 5వేలమందికి ఒక సబ్‌ సెంటర్‌ ఉండాలి
3.ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి
4.ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలి
5.చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి
6.రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు. వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి
7.యూత్‌ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి
8.సబ్‌సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది
9.ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి
10.ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి
11.ఒక కౌన్సెలర్‌ లేదా సోషల్‌ వర్కర్‌ ఉండాలి
12.దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలి
13.ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి
14.2 బెడ్‌ ఐసీయూ సదుపాయం ఉండాలి