సీఎం జగన్ కీలక ఆదేశాలు – ఏపీలో బార్ల సంఖ్య తగ్గింపు

Wednesday, November 20th, 2019, 01:00:36 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చాలా కృషి చేస్తున్నారు. కాగా ఈమేరకు తాజాగా మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం జగన్. కాగా రాష్ట్రంలో ప్రస్తుతానికి అమలవుతున్న మద్యం విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి సీఎం జగన్ తో పాటు ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య, మద్యం సరఫరా వేళలు, కల్తీ మద్యం తదితర అంశాలపై చర్చలు జరిగాయని సమాచారం.

అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్నటువంటి 798 బార్లను 50 శాతానికి తగ్గించాలని సీఎం జగన్ ఆదేశించగా, ఇప్పటికే మద్యం దుకాణాలను 20 శాతానికి తగ్గించామని, అంతేకాకుండా దశల వారీగా మరింతగా తగ్గిస్తామని అధికారులు చెప్పారు. అయితే మొత్తానికి రాష్ట్రంలో 40 శాతానికి తగ్గించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా బార్ల షాపుల్లో మద్యం సరఫరా చేసే సమయాన్ని కూడా తగ్గించాలని, ఆహారాన్ని మాత్రం రాత్రి 11 వరకు సరఫరా చేయాలనీ సూచించారు. ఒకవేళ ఎవరైన ఈ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.