ఫేక్ న్యూస్ కి చెక్ పెడుతూ…ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం జగన్

Friday, March 5th, 2021, 01:58:55 PM IST

ఫేక్ న్యూస్ కి అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు ప్రచారాన్ని అడ్డుకొనేందుకు, ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టే విధంగా ప్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఈ వెబ్ సైట్ యొక్క ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు.

అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఫేక్ న్యూస్ ఎక్కడ పడితే అక్కడ వైరల్ చేస్తూ ఆకతాయిలు ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పైన కానీ, ఏ విషయం లో నైనా ఫేక్ న్యూస్ అనిపిస్తే ఫేక్, ఫాక్ట్ అంటూ కొత్త ఆప్షన్స్ ను ఈ వెబ్ సైట్ లో తీసుకు వచ్చింది. అయితే దేశ వ్యాప్తంగా ప్రచారం లో ఉన్న అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో, ఆన్లైన్ లో అత్యంత నమ్మకం గా ఉండే ఫేక్ న్యూస్ ను వైరల్ చేయకుండా ఆపేందుకు, నిజాలు తెలుసుకొనేందకు ఇది ఉపయోగపడుతుంది. సంస్థలు, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించ పరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఏదైనా ఫేక్ వార్త అని అనిపిస్తే @Factcheckapgov ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్యాగ్ చేయవచ్చు. లేదంటే https://www.facebook.com//factcheck apgov ఫేస్బుక్ పేజ్ ను ట్యాగ్ చేస్తే సరిపోతుంది. లేదా వెబ్ సైట్ కొరకు https://factcheck.ap.gov.in/ లో చూడవచ్చు.